జాన్సెన్ కోవిడ్ వ్యాక్సిన్ కు బహ్రెయిన్ అత్యవసర అనుమతి
- February 26, 2021
మనామా:కోవిడ్ ముప్పు నుంచి తమ దేశ ప్రజలను రక్షించుకునేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం మరో వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తి చేస్తున్న జాన్సెన్ కోవిడ్ వ్యాక్సిన్ కు బహ్రెయిన్ నేషనల్ హెల్త్ రెగ్యూలేటరీ అథారిటీ అత్యవసర అనుమతి ఇచ్చినట్లు ప్రకటించింది. దీంతో బహ్రెయిన్ లో అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ల సంఖ్య ఐదుకు పెరిగింది. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండే వర్గాల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గతంలోనే నాలుగు రకాల వ్యాక్సిన్లను ఆమోదించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జాన్సెన్ వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీ తమకు సమర్పించిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాల డాక్యుమెంట్లను, జాన్సెన్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న దేశాల్లో దాని ప్రభావ తీరును మరింత లోతుగా అధ్యాయనం చేస్తున్నట్లు నేషనల్ హెల్త్ రెగ్యూలేటరీ అథారిటీ వెల్లడించింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







