ఒమన్ ఎయిర్లో మై స్పేస్ ఆఫర్..ఎక్స్‌ట్రా సీట్లు బ్లాక్ చేసుకునేందుకు ఛాన్స్
February 26, 2021
కోవిడ్ ముప్పు నుంచి ప్రయాణికులు భద్రత పొందెందుకు, సురక్షిత భావన కలిగించేందుకు ఒమన్ ఎయిన్ మై స్పేస్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా ప్రయాణికుడు తన పక్కన ఉన్న మూడు సీట్లను బ్లాక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంటే ప్రయాణికుడు తాను బుక్ చేసుకున్న సీటుతో పాటు మూడు సీట్ల వరకు ఇతరులు కూర్చొనే అవకాశం ఉండదు. దీంతో భౌతిక దూరం పాటించేందుకు అతనికి సౌకర్యకరమైన పరిస్థితులు, విశ్వాసం కల్పించినట్లు అవుతుందని ఒమన్ ఎయిర్ వివరించింది. అయితే..మై స్పేస్ ఆఫర్లో భాగంగా ఒకటి కంటే ఎక్కువ సీట్లు ఖరీదు చేయాలంటే ఆన్లైన్ చెకిన్ సమయాల్లోనే వీలు ఉంటుందని స్పష్టం చేసింది. అంటే విమానం బయల్దేరే సమయానికి 48 గంటల నుంచి 3 గంటల ముందు వరకు ఎక్స్‌ట్రా సీట్లు బుక్ చేసుకోవచ్చు.