గల్ఫ్ దేశాల్లో కోవిడ్ హెల్త్ పాస్ పోర్ట్ అమలు యోచనలో జీసీసీ
- February 27, 2021
కోవిడ్ నేపథ్యంలో జీసీసీ దేశాల పౌరులు ఆటంకాలు లేకుండా ప్రయాణించేందుకు అనువైన మార్గాలను అన్వేషిస్తోంది జీసీసీ. ఇందుకోసం ఏకీకృత కోవిడ్ హెల్త్ పాస్ పోర్టును అమలులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.అంటే జీసీసీ దేశాల మధ్య ప్రయాణించే గల్ఫ్ దేశాల పౌరులకు ప్రత్యేక పాస్ పోర్టులను మంజూరు చేస్తారు. ఆ పాస్ పోర్టులో ఓ క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్లో ఆ వ్యక్తి పేరు, పుట్టిన తేది, మాతృదేశంతో పాటు అతను ఏ రకం వ్యాక్సిన్ తీసుకున్నాడో వివరాలన్ని నిక్షిప్తమై ఉంటాయి. క్యూఆర్ కోడ్ నేషనల్ వ్యాక్సిన్ రిజిస్టర్ కు లింక్ అయి ఉంటుంది. దీంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వెంటనే అతని వివరాలన్ని డిస్ ప్లే అవుతాయి.ఈ తరహా పాస్ పోర్టుతో వ్యాక్సిన్ తీసుకున్న గల్ఫ్ దేశాలకు చెందిన పౌరులు జీసీసీ దేశాల్లో ప్రయాణించటం సునాయసం అవుతుంది.
తాజా వార్తలు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







