గిఫ్ట్ కార్డుల పేరిట ఘరానా మోసం..

- March 01, 2021 , by Maagulf
గిఫ్ట్ కార్డుల పేరిట ఘరానా మోసం..

హైదరాబాద్:గిఫ్ట్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మందిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.బీహార్ కి చెందిన 5 గురితో పాటు మంచిర్యాలకి చెందిన మరో 5 గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. పరారీలో మరో నలుగురు ఉన్నారని అంటున్నారు. ఇక అరెస్ట్ అయిన వారి నుండి 42 మొబైల్ ఫోన్ లు, 2 లాప్టాప్ లు, 900 స్క్రాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటివరకు 2 కోట్ల రూపాయలు మోసం చేశారని పోలీసులు గుర్తించారు.సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ గత సెప్టెంబర్ లో  ఒక బాధితుడు నుంచి ఫిర్యాదు అందిందని, కార్తీక్ అనే పేరుతో ఫోన్ చేసి బాధితుడి వివరాలు తీసుకున్నాడని తర్వాత పోస్ట్ కార్డులో స్క్రాచ్ కార్డు వచ్చిందని అన్నారు.

మీరు టాటా సఫారీ కార్డును గెలుచుకున్నారు అని కోవిడ్ వల్ల డెలివరీ చేయలేకపోతున్నామని చెప్పారని డెలివరీ, వివిధ చార్జీల క్రింద 45 వేల రూపాయలు నిందితుడు చెప్పిన ఖాతాలో బాధితులు జమ చేశారని అన్నారు. ఇలా విడతల వారీగా వివిధ బ్యాంకు ఖాతాల్లో మొత్తం 95.45 వేళా రూపాయలు జమ చేశారని, డెలివరీ చేయకుండా ఇంకా డబ్బులు అడగటంతో బాధితుడు ఫిర్యాదు చేశాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా కీలక అంశాలు తెలిశాయని అన్నారు. ప్రధాన నిందితుడు కుమార్ వివిధ ఈ కామర్స్ వెబ్సైట్ లు షాప్ క్లూస్,క్లబ్ ఫ్యాక్టరీ, నాప్టాల్ నుంచి ఫోన్ నంబర్లు సేకరించారని, ఈ విషయంలో ఇతనికి ఆలోక్, తీరాంజు అనే మరో ఇద్దరు సహాయం చేశారని అన్నారు. తరుణ్ కుమార్ మోహిత్ తో కలిసి స్కార్చ్ కార్డులు తయారు చేస్తారని గిఫ్ట్ కార్డులను స్క్రాచ్ చేసి కార్డు పై ఉన్న నంబరుకి కాల్ చేయమని ఉంటుందని కస్టమర్ కాల్ చేసి మాట్లాడిన భాష ప్రకారం టెలీ కాలర్స్ లాగా మాట్లాడతారని ఇల్స్స్ ఇప్పటి వరకూ సైబరాబాద్ లో 3కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. కాల్ చేసిన వారి నుంచి గిఫ్ట్ డెలివరీ కోసం వివిధ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని గిఫ్ట్ పంపకుండా మోసాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com