తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 02, 2021
హైదరాబాద్:తెలంగాణలో ఇవాళ కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 163 పాజిటివ్ కేసులు నమోదవగా...ఒక మరణం సంభవించింది. అదే సమయంలో 157 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,086కు చేరుకోగా.. 2,95,544 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1635 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.81 శాతంగా ఉందని.. ప్రస్తుతం 1,907 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 774 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 40,181 శాంపిల్స్ టెస్ట్ చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 2,35,389కు చేరిందని బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్‌కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్‌ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









