వైరస్‌ వ్యాప్తి ఆగిపోతుందన్నది అవాస్తవం:WHO

- March 02, 2021 , by Maagulf
వైరస్‌ వ్యాప్తి ఆగిపోతుందన్నది అవాస్తవం:WHO

జెనీవా:కరోనా వైరస్‌ వ్యాప్తి ఈ ఏడాది చివరికల్లా ఆగిపోతుందన్న ప్రచారాలు పూర్తి అవాస్తవమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. సమర్థవంతమైన టీకాల వల్ల కరోనా మరణాలు, ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని WHO ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్‌ డాక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ తెలిపారు.వైరస్‌ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఆయన అన్నారు. అయితే మార్పులు చెందుతున్న వైరస్‌ మరింత ప్రమాదకారిగా మారే అవకాశముందని WHO హెచ్చరించింది. కోవిడ్‌ మహమ్మారి నిర్మూలనకు అన్ని దేశాలూ సమిష్టిగా కృషి చేయాలని కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com