ఎడ్యుకేషనల్ స్టాఫ్‌కి వ్యాక్సినేషన్ ప్రూఫ్ లేదా వీక్లీ కోవిడ్ 19 టెస్ట్ తప్పనిసరి
- March 04, 2021
దోహా:ఎడ్యుకేషనల్ మరియు అడ్మనిస్ట్రేటివ్ స్టాఫ్ అలాగే విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్యకేషనల్ స్టాఫ్ అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ప్రతి వారం తప్పనిసరిగా కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాలి.ఎతెరాజ్ స్టేటస్ - గోల్డెన్ ఫ్రేమ్ లేదా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్డు లేదా వీక్లీ కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్‌ని రుజువుగా చూపించి మాత్రమే ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్‌లోకి సిబ్బంది అడుగు పెట్టాల్సి వుంటుంది. మార్చి 21 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ కోవిడ్ 19 పాజిటివ్ అని తేలినా, కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినా ‘పే చెల్లింపు’ లేకుండా క్వారంటైన్ పీరియడ్ వుంటుంది. వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి సరైన కారణం చెప్పనివారికి ఇది వర్తిస్తుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!