'అటాక్' అంటున్న వర్మ..

- May 30, 2015 , by Maagulf
'అటాక్' అంటున్న వర్మ..

రాంగోపాల్ వర్మ ఈ మధ్య చాలా బిజీబిజీగా ఉంటున్నారు. సినిమాల మీద సినిమాలు తెగ తీసేస్తూ ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే '365 డేస్' సినిమాను విడుదల చేసిన ఆయన.. ఇప్పుడు మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లాంటి అగ్రశ్రేణి తారాగణంతో 'ఎటాక్' అనే కొత్త సినిమా తీస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. సినిమా మోషన్ పోస్టర్ ను యూట్యూబ్ ద్వారా పరిచయం చేశారు. ఇందులో మళ్లీ ప్రకాష్ రాజ్ 'అంతఃపురం' లాంటి పాత్రలో కనిపించేలా ఉన్నారు. మనోజ్, జగపతి బాబు కూడా పూర్తి ఫైర్ చూపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తానని కూడా రాంగోపాల్ వర్మ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com