కర్ఫ్యూ టైంలో మసీదులకు నడిచి వెళ్లేందుకు అనుమతి
- March 05, 2021
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించిన కువైట్ ప్రభుత్వం..మసీదుల్లో ప్రార్థనలకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రత పెరుగుతుండటంతో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొత్తం 12 గంటల పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 7 నుంచి నెల రోజుల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే..కర్ఫ్యూ సమయంలో ప్రార్థనలకు వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పించింది. మసీదుల్లో ప్రార్థనలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం..భక్తులు తమ ఇంటి దగ్గరి మాస్కులకు మాత్రమే వెళ్లాలని, వాహనాల్లో కాకుండా నడిచి వెళ్లాలని స్పష్టత ఇచ్చింది. ఫార్మసీ, కోఆపరేటీవ్ సొసైటీలు కూడా కర్ఫ్యూ సమయంలో డెలివరీ సేవలు కొనసాగించొచ్చని స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







