గల్ఫ్ దేశాలకు 68% ఫ్లైట్స్ కేటాయింపు
- March 06, 2021
కరోనా ప్రభావంతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ లేటెస్ట్ షెడ్యూల్ ను ప్రకటించింది ఇండియా ప్రభుత్వం. ఈ సారి విడతలో ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల నుంచి ఇండియన్లను తీసుకువచ్చేందుకు 1,350 ఫ్లైట్స్ ను షెడ్యూల్ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మార్చి 1 నుంచి 28 వరకు ఫ్లైట్స్ ను ఆపరేట్ చేస్తామని, ఈ సమయంలో దాదాపు 2,60,000 మంది స్వదేశానికి చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే..మొత్తం 1,350 ఫ్లైట్స్ ని షెడ్యూల్ చేస్తే అందులో సగానికంటే ఎక్కువ జీసీసీ దేశాలకే కేటాయించారు. జీసీసీ దేశాలకు 920 ఫ్లైట్స్ ఆపరేట్ చేయనున్నారు. మొత్తం విమానాల్లో ఇది 68 శాతం. నార్త్ అమెరికా నుంచి 150 ఫ్లైట్స్, యూకే, యూరప్ నుంచి 120, అగ్నేయ ఆసియా దేశాల నుంచి 50 వందే భారత్ మిషన్ ఫ్లైట్లను నడపనున్నట్లు శ్రీవాత్సవ వివరించారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!