నైట్ టైం ఆంక్షలను ఉల్లంఘిస్తే 300 రియాల్స్ ఫైన్

నైట్ టైం ఆంక్షలను ఉల్లంఘిస్తే 300 రియాల్స్ ఫైన్

మస్కట్:కోవిడ్ వ్యాప్తిని వీలైనంత మేర అరికట్టేందుకు సుప్రీం కమిటీ సూచించిన మార్గనిర్దేశకాలను ప్రజలు, వాణిజ్య కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని మస్కట్ మున్సిపాలిటీ వెల్లడించింది. వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు వాణిజ్య కేంద్రాలు మూసివేయాలని సూప్రీం కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే 300 రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు.రెండో సారి కూడా ఉల్లంఘనకు పాల్పడితే 1000 రియాల్స్ తో పాటు బిజినెస్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పాక్షిక ఆంక్షలు రెస్టారెంట్లు,కేఫ్ లకు కూడా వర్తిస్తాయని, ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో హోం డెలివరీకి కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు.అయితే..అత్యవసర రంగాలైన వైద్య కేంద్రాలు, ప్రైవేట్ ఫార్మసీ, పెట్రోల్ బంకులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉందని, అలాగే ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణించేందుకు కూడా అనుమతి ఉంటుందని స్పష్టత ఇచ్చింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

 

Back to Top