ఖైదీలు వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే వెసులుబాటు
- March 07, 2021
బహ్రెయిన్: వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఖైదీలు..దేశంలో అనుమతి పొందిన వ్యాక్సిన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చని బహ్రెయిన్ ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావశీలతను ఇప్పటికే జైలులోని ఖైదీలకు వివరించినట్లు అధికారులు వివరించారు. వారికి అందించిన సమాచారం మేరకు ఖైదీలు ఏ వ్యాక్సిన్ ఎంపిక చేసుకుంటే ఆ వ్యాక్సిన్ వేయనున్నట్లు వెల్లడించారు. అయితే..తొలి దశ వ్యాక్సినేషన్ లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ అవకాశం లేదు. కేవలం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను మాత్రమే తీసుకోవాలని, ఫలానా కంపెనీ వ్యాక్సిన్ అని ఎంచుకునేందుకు అవకాశం లేదని అప్పట్లో ప్రకటించింది. అయితే..ప్రస్తుతం వ్యాక్సిన్ లభ్యత పెరగటం, మార్గనిర్దేశకాలు మారుతూ ఉన్న నేపథ్యంలో ఖైదీలకు వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదిలాఉంటే ఖైదీల ఆరోగ్య సంరక్షణ కోసం పకడ్బందీగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!