ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు వేడుకలు

- March 09, 2021 , by Maagulf
ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు వేడుకలు

హైదరాబాద్: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో కేంద్రం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా ఉత్సవాలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ ఘనంగా వేడుకలు నిర్వహించాలని సీఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ ప్రాంతం ఎంతో విశిష్ట పాత్ర పోషించిందని వెల్లడించారు.

స్వతంత్ర భారతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, తెలంగాణలో ఉత్సవాలు ఘనంగా జరపాలని సీఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.ఈ నెల 12 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు 75 వారాలపాటు మహోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు.

కాగా, మార్చి 12న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లోనూ, వరంగల్ పోలీస్ గ్రౌండ్స్ లోనూ ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి సీఎం కెసిఆర్, వరంగల్ లో జరిగే కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com