ఆసియాలో టాప్-10 బీచ్‌ల్లో భారత్‌కు చెందిన మూడు బీచ్‌లకు స్థానం
- February 28, 2016
ఆసియాలోని టాప్-10 బీచ్‌ల్లో భారత్‌కు చెందిన మూడు బీచ్‌లకు స్థానం లభించింది. ప్రముఖ ట్రావెల్ వెబ్‌సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వీటిలో రెండు బీచ్‌లు గోవాలోనే ఉండటం గమనార్హం. గోవాలోని అగోండా, పలోలెం సహా అండమాన్‌లోని హేవ్‌లాక్ ఐలాండ్ వద్ద ఉన్న రాధానగర్ బీచ్‌లు టాప్-10లో చోటు సాధించాయి. 'విశాలమైన బీచ్‌లకు భారత్ నెలవు. పలు బీచ్‌లు అంతర్జాతీయంగా పేరొందాయి. 12 నెలల పాటు వివిధ యాత్రికుల అభిప్రాయాలను క్రోడీకరించి బీచ్‌లను ఎంపిక చేశాం' అని ట్రిప్ అడ్వైజర్ ఇండియా మేనేజర్ నికిల్ గంజూ తెలిపారు. ఈ ఏడాది ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కరీబియన్, అమెరికా, యూరప్, సౌత్ అమెరికా, లండన్‌లలో 343 బీచ్‌లు అవార్డులకు ఎంపికయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







