గ్లోబల్ కార్టింగ్ గ్రాండ్ ఫైనల్ కు ఆతిథ్యం ఇవ్వనున్న బహ్రెయిన్
- March 10, 2021
బహ్రెయిన్: కోవిడ్ కారణంగా ఇన్నాళ్లు మెగా స్పోర్ట్స్ ఈవెంట్లకు దూరంగా ఉన్న బహ్రెయిన్..ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఈవెంట్ కు వేదికగా నిలవబోతోంది. ఈ ఏడాది చివరి నెలలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వేదికగా రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ అతిథ్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. నిజానికి గ్లోబల్ కార్టింగ్ గ్రాండ్ ఫైనల్ 2020లోనే జరగాల్సి ఉంది. కానీ, కోవిడ్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించటంతో ఫైనల్ కార్టింగ్ రేస్ వాయిదా పడింది. ఎట్టకేలకు సాధారణ పరిస్థితుల దిశగా నిర్ణయాలు తీసుకోవటంతో గ్లోబల్ కార్టింగ్ ఈవెంట్ కు లైన్ క్లియర్ అయ్యింది. డిసెంబర్ 3న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో రోటాక్స్ మ్యాక్స్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ కార్టింగ్ రేస్ ప్రారంభం అవుతుంది. 11 వరకు ఈవెంట్ కొనసాగుతుంది. గ్లోబల్ కార్టింగ్ ఫైనల్ రేసులో 60 దేశాల నుంచి 400 మంది మేటి కార్టింగ్ డ్రైవర్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని బహ్రెయిన్ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







