ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కెవిఎస్‌ ఆదేశాలు

- February 28, 2016 , by Maagulf
ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కెవిఎస్‌ ఆదేశాలు

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రతిరోజూ జాతీయ పతాకావిష్కరణ జరపాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కెవిఎస్‌) ఆదేశాలు జారీ చేసింది. సెంట్రల్‌ యూనివర్శిటీలు తమ ప్రాంగణాల్లో రోజూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించిన కొద్ది రోజులకే కెవిఎస్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు త్రివర్ణ పతాకానికి వందనం చేయడానికి వీలుగా ఉండేలా విద్యార్థులు రోజూ ప్రార్థన చేసే ప్రదేశంలో ప్రముఖంగా కనిపించేలా పతాకాన్ని ఎగురవేయాలని కెవిఎస్‌ అడిషనల్‌ కమిషనర్‌ యుఎన్‌ ఖవారే పేర్కొన్నారు.
ఉదయం పతాకావిష్కరణ చేసి, సాయంత్రం సూర్యాస్తమయంలోగా అవనతం చేయాలని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్‌కు ఖవారే ఒక లేఖ రాశారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ కెవిఎస్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com