తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 14, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 228 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్కరు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 152 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,161 కు చేరగా.. రికవరీ కేసులు 2,97,515 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,653 మంది మృతిచెందారు..రికవరీ రేటు దేశంలో 96.7 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.78 శాతంగా ఉందని సర్కార్ చెబుతోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,993 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 795 మంది హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు.. ఇక, నిన్న ఒకే రోజు 50,998 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 92,00,465కు పెరిగింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్