గ్రామీ అవార్డులు.. చరిత్ర సృష్టించిన బియాన్సె
- March 15, 2021
లాస్ఏంజిల్స్: అమెరికన్ సింగర్, రైటర్ బియన్సె గ్రామీ అవార్డుల్లో చరిత్ర సృష్టించింది. గ్రామీస్ చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన మహిళగా ఆమె రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా 28వ అవార్డు గెలుచుకున్న బియాన్సె.. ఇప్పటి వరకూ సింగర్ అలీసన్ క్రాస్ పేరు మీద ఉన్న రికార్డును తిరగరాసింది. బెస్ట్ ఆర్&బీ పర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది తనకు దక్కిన అత్యున్నత గౌరవమని బియాన్సె చెప్పింది. అటు టేలర్ స్విఫ్ట్ కూడా గ్రామీ అవార్డుల్లో చరిత్ర సృష్టించింది. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మూడుసార్లు గెలుచుకున్న తొలి మహిళా ఆర్టిస్ట్‌గా టేలర్ స్విఫ్ట్ నిలిచింది. లాక్డౌన్లో ఆమె తీసుకొచ్చిన ఫోక్లోర్ ఆల్బమ్‌కుగాను ఈ అవార్డు దక్కింది. అంతకుముందు 2010లో ఫియర్లెస్ ఆల్బమ్‌కు, 2016లో 1989కు కూడా గ్రామీ అవార్డులను సొంతం చేసుకుంది. ఆమె కంటే ముందు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నది కేవలం ముగ్గురే. వాళ్లంతా మేల్ ఆర్టిస్ట్‌లే.
గ్రామీ అవార్డులు
ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ : టేలర్ స్విఫ్ట్ - ఫోక్లోర్
రికార్డ్ ఆఫ్ ద ఇయర్ : బిల్లీ ఐలిష్ - ఎవిరిథింగ్ ఐ వాంటెడ్
సాంగ్ ఆఫ్ ద ఇయర్ : హెచ్.ఈ.ఆర్. - ఐ కాంట్ బ్రీత్
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ : మేగన్ థీ స్టాలియన్
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!