బెగ్గర్స్ తో కోవిడ్ రిస్క్..ప్రజలను హెచ్చరించిన యూఏఈ
- March 17, 2021
యూఏఈ: కోవిడ్ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తికి తావిచ్చే అన్ని అవకాశాలపై దృష్టి సారించింది యూఏఈ. బెగ్గర్స్ నుంచి వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూఏఈ పోలీసులు హెచ్చరించారు. ముష్టివాళ్లు కోవిడ్ నిబంధనలు ఏవీ పాటించరనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, వారికి ఫేస్ మాస్కులు, గ్లౌజులు ఉండవు కనుక వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించింది. దారిలో వెళ్తున్న ప్రజలు తమపై జాలి పడేలా సెంటిమెంట్ ట్రిక్స్ ప్లే చేస్తారని, వారి దయనీయ స్థితికి జాలిపడి దానం చేయాలనే భావన మనలో కలగేలా చేస్తారని తెలిపారు. జాలితో వారికి డబ్బు, తిండి పదార్ధాలు, ఇతర వస్తువులు దానం చేసే సమయంలో ఇంటరాక్ట్ అవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయని, ఆ సమయంలోనే వైరస్ ఇతరులకు కూడా వ్యాపించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లు, ప్రార్థనా మందిరాలు, బస్టాండ్స్, మాల్స్ ప్రాంగణాల్లో ఎక్కువగా అడుక్కుంటూ ఉంటారు. అయితే..ప్రజలు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటూనే..సమాజ భద్రత కోసం వారి సమాచారాన్ని 901, 80040కి ఫోన్ చేసి తమకు అందించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







