బాలయ్యకు కూతురుగా సాయిపల్లవి!!..మరి ఒప్పుకుంటుందా?

బాలయ్యకు కూతురుగా సాయిపల్లవి!!..మరి ఒప్పుకుంటుందా?

టైటిల్ చూడగానే.. నందమూరి బాలయ్యకు తండ్రిగా ఏంటి..? ఆయనకు కుమార్తెగా స్టార్ హీరోయిన్ రేంజ్ ఉన్న సాయిపల్లవి కూతురుగా నటించడమేంటబ్బా..? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..? అవునండోయ్.. గత రెండు మూడ్రోజులుగా ప్రముఖ వెబ్ సైట్లలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ ఇంట్రెస్టింగ్ కాంబో గురించి పెద్ద ఎత్తున వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇందులో నిజానిజాలెంత..? బాలయ్య-సాయిపల్లవి కాంబోకు కథ రాసిందెవరు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

సౌత్ హీరోయిన్లలో సాయిపల్లవి స్టయిలే వేరన్న విషయం ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. తనను ఎవరైనా ఫలానా సినిమాలో నటించాలని సంప్రదిస్తే కథ, పాత్ర నచ్చితేనే చేస్తానని లేకుంటే ఎలాంటి గ్లామర్ పాత్రకు అయినా.. స్టార్ హీరోల సరసనైనా సరే మొహమాటం లేకుండా చేయనని చెప్పేస్తుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలా చాలా సినిమాలే ఈ బ్యూటీ మిస్ చేసుకుంది. అయితే.. వన్స్ ఈ భామ సినిమా ఒప్పుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఈ బ్యూటీని.. తన సినిమాలో ఫలానా పాత్రలో చేయాలని ఓ యంగ్ డైరెక్టర్ సంప్రదించినట్లు సమాచారం.

నందమూరి బాలయ్య ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి ఇరగదీసేస్తుంటారు. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబో సినిమాలో బిజీగా ఉన్న ఈ సీనియర్ హీరోను ఓ యంగ్ డైరెక్టర్ షూటింగ్‌లో కలిశాడట. సార్.. ఒక్క పది నిమిషాలు టైమిస్తే మూడు ముక్కల్లో కథ చెప్పేస్తానని పదే పదే కోరాడట. బాలయ్య ఓకే అనడంతో కథ సింపుల్‌గానే చెప్పేశాడట. కుర్ర డైరెక్టర్ చెబుతున్నంత సేపు బాలయ్య ఎంతో ఓపిగ్గా, ఆసక్తితో విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 'నాకు ఓకే.. నేను రెడీ.. ఇక నీ పనులు నువ్ చేసుకోపో' అని బాలయ్య చెప్పేశాడట. ఆయన్నుంచి ఇలా రెస్పాన్స్ రావడంతో రావడంతో యంగ్ డైరెక్టర్‌ ఆనందానికి హద్దుల్లేవట.

కథ మొత్తం కుమార్తె చుట్టూ తిరుగుతుందట. సింపుల్‌గా చెప్పాలంటే 'దృశ్యం' సినిమా స్టైయిల్‌లో ఉంటుందట. తండ్రిని కాపాడటం కోసం కుమార్తె పోరాడే కథట. తండ్రి బాలయ్య ఓకే.. ఓకే చెప్పేశాడట. ఇక మిగిలింది కుమార్తె పాత్రధారి.. అయితే సాయిపల్లవి అయితే సరిగ్గా సెట్ అవుతుందని డైరెక్టర్ ఆమెను సంప్రదించాడట. స్టోరీ వినడానికి తనకు కాస్త టైమ్ ఇవ్వాలని.. త్వరలోనే కూర్చుందామని చెప్పిందట. కథంతా విన్నాక ఈ నాచురల్ బ్యూటీకి ఓకే అంటే.. ఇక కుమార్తె కూడా సెట్ అయిపోయినట్లే.. సినిమా కూడా అదిరిపోతుంది.. ఇందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది పట్టాలెక్కించాలని యంగ్ డైరెక్టర్ అనుకుంటున్నాడట. సాయిపల్లవి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఉంటో మరి..!

Back to Top