ప్రయాణికుల పర్సనల్ లగేజ్, గిఫ్ట్ లపై వ్యాట్ నుంచి మినహాయింపు
- March 20, 2021
ఒమన్:తమ దేశానికి చేరుకున్న విమాన ప్రయాణికుల వ్యక్తిగత లగేజ్, బహుమతి వస్తులను వ్యాట్ నుంచి మినహాయిస్తున్నట్లు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. వాల్యూ యాడెడ్ టాక్స్-వ్యాట్ చట్టం మేరకు ఈ మినహాయింపులు ప్రకటించినట్లు స్పష్టం చేసింది. అయితే..వ్యాట్ నుంచి మినహాయింపు పొందెందుకు కొన్ని నిబంధనలకు లోబడి ఉండాల్సి ఉంటుంది. ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న లగేజ్ తో పాటు బహుమతులు పూర్తిగా వారి వ్యక్తిగతం అయి ఉండాలి. వారి వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించాలి. అంటే బహుమతుల పేరుతో వస్తువులను వాణిజ్యానికి వినియోగించకూడదు. అలాగే పదే పదే ప్రయాణించే వారికి, వాణిజ్య అవసరాల కోసం వస్తువులు తీసుకొచ్చేవారికి ఈ మినహాయింపు ఉండదు. బహుమతిగా తీసుకొచ్చే ఒక్కో వస్తువు విలువ 300 రియాల్స్ కి మించి ఉండకూడదు. 300 రియాల్స్ దాటితే ఆ వస్తువుపై వ్యాట్ విధిస్తారు. 400లోపు సిగరేట్లకు ఎలాంటి పన్ను ఉండదు.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







