గసగసాల పంట వేసినందుకు అరెస్టు చేసాము:సీపీ మహేష్ భగవత్

- March 19, 2021 , by Maagulf
గసగసాల పంట వేసినందుకు అరెస్టు చేసాము:సీపీ మహేష్ భగవత్

హైదరాబాద్:హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పండించిన గసగసాలను మహారాష్ట్ర,కర్ణాటక, రాజస్థాన్,ఒడిశా,మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నట్లు బయటపడింది. మొత్తం 390 బస్తాలను అధికారులు పట్టుకున్నారు.

నల్లమందు తయారీదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మత్తు మందు తయారీకి ఇప్పుడు తెలంగాణ అడ్డగా మారింది. ఓపీయంగా పిలిచే దీని తయారీకి అవసరమయ్యే ముడి సరకు ఇప్పుడు తెలంగాణలో పండిస్తున్నారు. దీని ముడి సరకు గసగసాలు కావడం గమనించదగ్గ విషయం. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గసగసాలు పంటను నిషేధించినప్పటికీ తెలంగాణలో మాత్రం పెద్ద మొత్తంలో పంటలు వేస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో గసగసాలు పంటలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి రాచకొండ పోలీసులు హైదరాబాద్ శివార్లలో పంట వేసిన వారిని పట్టుకున్నారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పండించిన గసగసాలను మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లకు తరలిస్తున్నట్లు బయటపడింది. మొత్తం 390 బస్తాలను అధికారులు ఇప్పటివరకు పట్టుకున్నారు. దీన్ని కర్ణాటకకు ఎగుమతి చేసి అక్కడి నుంచి దేశవ్యాప్తంగా గసగసాలను పంపిణీ చేస్తున్నట్టుగా అధికారుల విచారణలో బయటపడింది.

ఈ గసగసాలను ముఖ్యంగా హెరాయిన్, కొకైన్, ఓపీయం లాంటి మత్తు మందు తయారీలకు వాడుతున్నట్లుగా విచారణలో తేలింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో కోట్ల రూపాయల విలువ ఉంటుందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. అనుమతి లేకుండా ఎవరైనా గసగసాలను పండించిన పక్షంలో వారి పైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

గసగసాల నుంచి మత్తు మందు తయారి..
‘‘ఒక్క గ్రాము గసగసాల కాయలతో మార్ఫిన్ తయారవుతుంది. దానికి మరికొంత ప్రత్యేక రసాయన పదార్థం జతచేస్తే హెరాయిన్ తయారవుతుంది. ఈ హెరాయిన్ కోట్ల రూపాయల విలువ ఉంటుంది. ఇలా గత కొంత కాలంగా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు.రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మెడిసిన్ కోసం గసగసాల కాయలను వినియోగిస్తారు.అది కూడా అక్కడ ప్రభుత్వం కొన్ని నెలల వరకే అనుమతి ఇస్తుంది.ఇక్కడ పండించడానికి ఎలాంటి అనుమతులు లేవు.’’ అని సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

దీంతో నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం (NTPS Act) కింద కేసు నమోదు చేశామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com