రియాద్ లోని ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడులు
- March 20, 2021
సౌదీ:సౌదీ అరేబియా రాజధాని రియాద్ లక్ష్యంగా పొరుగు దేశంలోని తిరుగుబాటుదారులు తమ దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు.ఈ సారి రాజధానిలోని ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకొని డ్రోన్ దాడికి తెగబడ్డారు. అయితే..ఈ డ్రోన్ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేదని చమురు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. దాడి కారణంగా రిఫైనరీలో చెలరేగిన మంటలు చెలరేగాయని, వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. దీంతో ఆయిల్ సప్లై యధావిధిగా కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. ఇదిలాఉంటే..రియాద్ లక్ష్యంగా జరుగుతున్న దాడుల పట్ల సౌదీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలక సంస్థలు, జనావాసాలు టార్గెట్ గా తీవ్రవాదుల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయన్నారు. ఆయిల్ రిఫైనరీ వంటి ప్లాంట్ లపై దాడి చేయటం అంటే అంది ఒక్క సౌదీ అరేబియాపై మాత్రమే దాడిగా చూడలేమని అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్ధిక రంగం, చమురు సరఫరాపై కూడా దాని ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగ బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం రూ.150 కోట్ల ప్రతిపాదన
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్







