ఏప్రిల్ 23న 'ప్లాన్ బి'

ఏప్రిల్ 23న \'ప్లాన్ బి\'

హైదరాబాద్:శ్రీనివాస్ రెడ్డి హీరోగా సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, నవీనారెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'ప్లాన్ బి'. కె.వి.రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 23న విడుదల కాబోతోంది. దర్శకుడు రాజమహి మాట్లాడుతూ, "ఆద్యంతం ఉత్కంఠం తో థ్రిల్లింగ్ అంశాలతో  సాగే కథ ఇది. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కనీసం తన మొబైల్ ఫోన్ చూసే అవకాశం కూడా ఉండదు. అంత ఉత్కంఠం గా ఉంటుంది.  మా చిత్రాన్ని సెన్సార్ వారు అభినందించి, యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు'' అని చెప్పారు. రాజమహికి దర్శకుడిగా ఇది తొలి చిత్రమే అయినా... చక్కగా కథను తెరపైకి ఎక్కించారని, ఆయనకు మరో రెండు సినిమాలకు ఛాన్స్ దక్కిందని నిర్మాత ఎవిఆర్ తెలిపారు.

Back to Top