ఏపీలో కరోనా కేసుల వివరాలు

- March 20, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,978 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 380 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు.అదే సమయంలో 204 మంది రికవరీ అయ్యారు.దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 893366కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 884094 కి చేరింది.ఇక,ఇప్పటి వరకు కరోనాతో 7189 మంది మృతిచెందారు.ప్రస్తుతం రాష్ట్రంలో 2083 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌ లో పేర్కొంది సర్కార్.ఇక దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. 

రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజాగా కేంద్రం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 40,953 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది.ఇందులో 1,11,07,332 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 2,88,394 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 188 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,59,558కి చేరింది.గడిచిన 24 గంటల్లో భారత్ లో 23,653 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దేశంలో మొత్తం ఇప్పటి వరకు 4,20,63,392 మందికి వ్యాక్సిన్ ను అందించినట్టు కేంద్రం తన బులెటిన్ లో పేర్కొన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com