గల్ఫ్ కు కార్మికులను స్మగ్లింగ్ చేస్తున్న ఏజెన్సీపై సీబీఐ విచారణ జరపాలి

- March 20, 2021 , by Maagulf
గల్ఫ్ కు కార్మికులను స్మగ్లింగ్ చేస్తున్న ఏజెన్సీపై సీబీఐ విచారణ జరపాలి
  • మానవ అక్రమరవాణా గురించి సహ చట్టంలో ప్రశ్నించిన గల్ఫ్ బాధితుడి భార్య
  • లైసెన్సు ముసుగులో జోరుగా విజిట్ వీసాల దందా

తెలంగాణ:గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుల అక్రమ దందా కారణంగా తన భర్తకు ఒక లక్ష రూపాయల విలువైన ఆరోగ్య బీమా అందకుండా పోయిందని తమకు న్యాయం చేయాలని జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన ఒక మహిళ జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించింది.

జగిత్యాలకు చెందిన తండ్రీ కొడుకులు తంగెళ్ల గంగారాం,తంగెళ్ల సత్యం లు కార్తీక్ ఇంటర్నేషనల్ అనే పేరుతో గల్ఫ్ ఉద్యోగాల రిక్రూటింగ్ ఏజెన్సీ లైసెన్సును అడ్డంపెట్టుకొని అమాయకులైన కార్మికులను విజిట్ వీసాలతో దుబాయ్ కి పంపిస్తూ మోసం చేస్తూమానవ అక్రమరవాణాకు పాల్పడుతున్నారని జైన గ్రామానికి చెందిన కొక్కెరకాని గంగజల ఈనెల 2న జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయంపై  సిబిసిఐడి, సిబిఐతో పోలీసు దర్యాప్తు లేదా ఇతర పరిశోధన విభాగాలతో  విచారణ చేయించాలని ఆమె కోరారు.

తానూ ఇచ్చిన దరఖాస్తుపై ఏమి చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఆమె శనివారం (20.03.2021) సమాచార హక్కు చట్టం క్రింద జిల్లా కెలెక్టర్  కార్యాలయంలో ఒక దరఖాస్తు సమర్పించారు. తమకు న్యాయం చేయాలని మరో ప్రత్యేక దరఖాస్తు కూడా చేశారు. గంగాజల వెంట పక్షవాతంతో బాధపడుతున్న ఆమె భర్త పోశన్న వారి కుమారుడు కృతిక్ నందన్ (05), కూతురు మనస్విని (02), ఆమె తండ్రి రాజలింగు ఉన్నారు. 

దుబాయ్లో పక్షవాతానికి గురై సంవత్సరం క్రితం స్వదేశానికి  తిరిగివచ్చిన తన భర్త కొక్కెరకాని పోశన్న ఒక లక్ష రూపాయాల విలువైన వైద్య సహాయం పొందలేకపోవడానికి కారణం ఏజెన్సీ నిర్వాహకులేనని ఆమె అన్నారు.తన భర్త వైద్య ఖర్చులు, ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారంగా మారిందని ఆమె వాపోయింది. 

ఇసిఆర్ పాస్ పోర్టు కలిగిన పోశన్నకు చట్టబద్దంగా రూ.10 లక్షల విలువైన  'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా పాలసీ, ఒక లక్ష రూపాయల ఆరోగ్య బీమాపొందడానికి అర్హత ఉన్నదని ఆమె అన్నారు.గల్ఫ్ ఏజెన్సీ నిర్వాహకులు తమ వద్ద రూ.68 వేలు తీసుకొని పోశన్నను దుబాయ్ కి  విజిట్ వీజాపై పంపి మోసం చేశారని, ఒప్పుకున్న ప్రకారం బీమా పాలసీ జారీ చేయలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com