ఆయుర్వేదం చెప్పే ఆరోగ్య చిట్కాలు..
- March 21, 2021
ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి.. ఎవరిమీదా ఆధారపడకూడదు.. ఏ అనారోగ్యం దరిచేరకూడదు.. అయితే అదేమంత కష్టం కాదు అంటోంది ఆయుర్వేద వైద్యం.మనసుకి మంచి ఆలోచనలు ఎలాగో.. శరీరంలో మలినాలు సాధ్యమైనంత తక్కువగా ఉండాలని చెబుతోంది. అంతేకాదు శరీరంలో పేరుకున్న మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతే మనుషులు ఆరోగ్యంగా ఉంటారని అంటోంది. ఆరోగ్యాన్నందించే 6 ముఖ్యమైన సూత్రాల గురించి చెబుతోంది ఆయుర్వేదం.మరి వాటి గురించి తెతెలుసుకుందాము..
1. బెడ్ మీదే ఉండి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టే బదులు ఓ పది నిమిషాలు ఎండ పడే ప్రాంతానికి వచ్చి అక్కడ ఛాటింగ్ చేయండి.. సూర్య కిరణాలు మీ మేనుని తాకి కావలసిన డి-విటమిన్ అందిస్తుంది. శరీరం కొత్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆ సమయంలో పడే సూర్య కిరణాలు మీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే బ్రష్‌కి ముందే ఓ గ్లాస్ వేడినీళ్లు తాగితే శరీరంలో పేరుకున్న మలినాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.ఇది తప్పనిసరిగా మీ దినచర్యలో భాగం చేస్తే సగం ఆరోగ్య సమస్యలు తీరినట్లే.
2. సాయింత్రం వీచే చల్లని గాలిలో కొంత సమయం గడపాలి. చల్లని గాలి స్పర్శ శరీరానికి టానిక్‌లా పనిచేస్తుంది. ఓ గంట వ్యాయామం చేయడం ద్వారా శరీరంలో మలినాలు చేరకుండా ఉంటాయి. అస్వస్థతకు గురైన తరువాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే ముందు నుంచి మంచి అలవాట్లు పెంచుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా నివారించొచ్చు.
3.సమయానికి ఆహారం తినకపోగా, ఎప్పుడు పడితే అప్పుడు తినడం సరికాదు.. శీతల పానీయాలు, కాఫీ, టీలు మితిమీరి తాగకూడదు. ఇలాంటి అలవాట్లు ఆరోగ్యానికి ఏ మాత్రం మేలు చేయవు.
4.ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపవాసం ఓ చక్కని చికిత్స. లంకణం పరమౌషధం అని ఆయుర్వేదం చెబుతోంది. జీర్ణవ్యవస్థకు అప్పుడప్పుడూ విశ్రాంతి ఇవ్వాలి. తరచూ ద్రవపదార్థాలు, పండ్లను తీసుకుంటూ ఉపవాసాన్ని ఆచరించాలి. దీనివల్ల శరీరంలో పేరుకున్న మలినాలు తొలిగిపోతాయి. నీరు కూడా తగినంత తీసుకోవాలి. మంచిది కదా అని మించి తీసుకుంటే దాని వల్ల చెడే ఎక్కువగా జరుగుతుందని డాక్టర్లు అంటారు.
5.తీసుకునే ఆహారం మితంగా ఉండాలి. తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేంత వరకు మళ్లీ తినకుండా ఉండడం ఉత్తమం.
6.అనారోగ్య హేతువులైన మద్యపానం, కూల్ డ్రింకులు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆధునిక జీవనశైలి మనిషిని రోగాల బారిన పడేస్తుంది. షుగర్, బీపీ, స్థూలకాయం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్‌లు, నిద్రలేమి ఇలా ఒకటేమిటి ఎన్నో అనారోగ్య సమస్యలు. దీనికి తోడు ఖరీదైన వైద్యం. అందుకే ఆరోగ్యంపై కొంత జాగ్రత్త అవసరం. చికిత్స కంటే నివారణ మేలనే సూత్రాన్ని మర్చిపోకూడదు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







