గురక పెట్టె వాళ్లకు చిట్కాలు
- March 22, 2021నిద్ర పోతున్నప్పుడు చాలా మందికి ఎదురైయే సమస్య గురక పెట్టడం. గురక పెట్టడం వల్ల పక్కన ఉన్న వారికి నిద్రాభంగం అవుతుంది. గుర్రు పెట్టె వారిపై చిరాకు, కోపం, చూపిస్తారు. గురక రావడానికి చాల కారణాలు ఉన్నాయి అనే చెప్పాలి. నోరు మూసుకొని గురకపెడుతుంటే. నాలుక లో సమస్య ఉందనితెలుసుకోవాలి. నోరు తెరిచి గురక పెడుతుంటే. గొంతులోని మృదువైన కణజాలలో సమస్యగా భావించాలి. వెల్లకిలా పడుకుని గురక పెడితే మాత్రం ప్రధాన సమస్యగా ఆలోచించాలి .
అయితే ఎలా నిద్ర పోతున్న కూడా గురక వస్తుంటే అది తీవ్ర సమస్య గానే చెప్పాలి. గురక సమస్యకు పరిష్కారం గా ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. గ్లాసు వేడి పాలలో రెండు టీ స్పూన్లు పసుపు పొడిని కలిపి తీసుకున్నాకూడా గురక సమస్య తీరుతుంది. అర టీ స్పూన్ తేనె అలాగే అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, కలిపి రాత్రి నిద్రపోయే ముందుతాగడం వలన గురక తగ్గుతుంది. మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు ఆవిరి పడితే గురక రాకుండా ఉంటుంది. ఆవు నెయ్యిని కరిగేలా కొద్దిగా వెచ్చ పెట్టి రెండు చుక్కల చొప్పున రోజూ రెండు ముక్కు రంధ్రాలలో వేసి పీల్చితే గురక నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. పయిన చెప్పిన వాటిల్లో ఏది చేసిన మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ