తెలంగాణ ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్...రిటైర్మెంట్ వయోపరిమితి 61ఏళ్ళు: కేసీఆర్
- March 22, 2021
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేశారు. 30 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టి.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు.
కరోనా వల్ల ఈసారి వేతన సవరణ ఆలస్యమైందన్నారు. ఉద్యోగుల వేతన సవరణ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటున్నామని చెప్పారు. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించింది. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయమైనది అని కొనియాడారు. ఉమ్మడి ఏపీలో టీఎన్జీవో తెగించి పోరాడిందన్నారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో టీఎన్జీవో స్ఫూర్తి మరువలేనిది అని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







