ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్..పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది రెడీ
- March 23, 2021
ఆండ్రాయిడ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అయ్యాయి. కొంతమంది వినియోగదారులు ఆండ్రాయిడ్ పరికరాల్లో యాప్స్ తో ఇబ్బందులు ఎదురుక్కొంటున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ సిబ్బంది పనిచేస్తోంది.
గూగుల్ వర్క్ స్పేస్ స్టేటస్ పేజీలో ఆండ్రాయిడ్ లోని జీమెయిల్ తో సమస్యలు ఉన్నట్లు గూగుల్ అంగీకరించింది. ఈ సమస్యను పరిష్కరించేవరకు వినియోగదారులు డెస్క్ టాప్ వర్షన్ వినియోగించుకోవాలని గూగుల్ సూచిస్తుంది.
ఎవరైతే ఈ సమస్యను ఎదుర్కొటున్నారో..జీమెయిల్ యాక్సెస్ చేయలేరని చెబుతోంది. అయితే త్వరలోనే అప్ డేట్ అందిస్తామని... వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమిస్తామని గూగుల్ చెబుతోంది.
ఆండ్రాయిడ్ వర్షన్ తో ఇబ్బంది పడుతున్న వారు .. డెస్క్ టాప్ జీమెయిల్ ఇంటర్ ఫేస్ తో వాడుకోవచ్చని సూచిస్తోంది. మరోవైపు శాంసంగ్ కూడా ఈ సమస్యను దృవీకరించింది. యూజర్స్ శాంసంగ్ కొన్ని సూచనలు చేస్తోంది. దయచేసి వెబ్ వ్యూ అప్ డేట్ తీసేసి... ఆ తర్వాత ఫోన్ రిస్టార్ట్ చేయాలని శాంసంగ్ యూస్ సపోర్ట్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్లు మార్పులు చేసుకునేందుకు ఈ సెట్టింగ్స్ ఫాలో అవ్వాలని సూచిస్తోంది. సెట్టింగ్స్ > యాప్స్> పైన మూడు చుక్కలపై క్లిక్ చేయాలి > షో సిస్టమ్ యాప్స్ క్లిక్ చేయాలి > సెర్చ్ ఫర్ ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్ వ్యూ > సెలెక్ట్ అనిస్టాల్ అప్ డేట్స్ ను క్లిక్ చేయండని శాంసంగ్ పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..