'తలైవి' ట్రైలర్
- March 23, 2021పుట్టినరోజుకు ఒక రోజు ముందే జాతీయ అవార్డును కానుకగా అందుకున్న కంగనా రనౌత్ బర్త్ డే రోజున 'తలైవి' సినిమా ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పురైచ్చి తలైవి జయలలిత బయోపిక్ గా రూపొందుతోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ బయోపిక్ చిత్రం ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. దర్శకుడు విజయ్ జయలలితలోని సినిమా, రాజకీయ కోణాలను క్లియర్ గా చూపించబోతున్నట్లుగా ఉంది. ఇక కంగనా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో జయలలితను మరిపించిందనే చెప్పాలి. ఎం.జి.ఆర్ గా అరవింద స్వామి కూడా పర్ ఫెక్ట్ గా సూటయ్యాడు. జీవి ప్రకాష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ సినిమాను గ్రాండియర్ గా కనిపించేట్లు చేస్తున్నాయి. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 23న భారీ స్థాయిలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?