హౌసింగ్ మినిస్ట్రీ మొబైల్ యాప్ ప్రారంభం
- February 29, 2016
హౌసింగ్ మినిస్ట్రీకి సంబంధించి అన్ని వివరాలు అందరికీ అందుబాటులో ఉంచేలా మొబైల్ యాప్‌ని రూపొందించారు. ఇ గవర్నమెంట్ అథారిటీ సహకారంతో హౌసింగ్ మినిస్టర్ బషీమ్ అల్హామర్ 'హౌసింగ్ మినిస్ట్రీ అప్లికేషన్'ని ప్రారంభించారు. యాండ్రాయిడ్ అప్లికేషన్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వినియోగదారులు డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని తొలి విడతగా కల్పించారు. ముందు ముందు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పనిచేసేందుకు వీలుగా యాప్‌ని డెవలప్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇళ్ళు, అపార్ట్మెంట్లు, అలాగే తాత్కాలిక గృహాలు, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మరియు రిపెయిరింగ్కి సంబంధించిన అంశాలు అన్నీ ఈ యాప్ ద్వారా సులభతరమవుతాయి. మినిస్ట్రీతో డైరెక్ట్‌గా ఛాటింగ్ చేసుకునే అవకాశమూ కల్పిస్తోంది ఈ యాప్. సంవత్సరానికి సుమారుగా 114,00 ఎంక్వయిరీ రిక్వెస్ట్‌లు మంత్రిత్వ శాఖ వద్దకు వస్తున్నాయనీ, ఇకపై వాటి సంఖ్య గణనీయంగా తగ్గడంతోపాటు, మినిస్ట్రీ అధికారులపైనా ఒత్తిడి తగ్గుతుందని మంత్రి మినిస్టర్ చెప్పారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









