అక్రమ భూ వినియోగానికి జరీమానా
- February 29, 2016
అబుదాబీ సిటీ మునిసిపాలిటీ, అల్ వత్బా మున్సిపల్ సెంటర్ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించింది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని సద్వినియోగం చేయకపోవడం, దుర్వినియోగానికి పాల్పడటం, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్‌ని తుంగలో తొక్కడం వంటివాటి విషయమై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. అమల్లో ఉన్న టెనెన్సీ అగ్రిమెంట్లను రిన్యూ చేయడం, అలాగే ఇండస్ట్రియల్ ల్యాండ్స్‌కి చెందిన అద్దె బాకీలను వసూలు చేయడం ఇవన్నీ ఇందులోని ముఖ్యమైన అంశాలుగా అధికారులు వివరించారు. నిబంధనల్ని అతిక్రమించిన వారికి చట్టాలకు అనుగుణంగా జరీమానాలు విధించబడ్తాయ వారు చెప్పారు. ఆర్టికల్ 17 ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘించినవారికి 30,000 దిర్హామ్‌ల ఫైన్ విధించడంతోపాటు, అతిక్రమణల్ని తొలగించడం జరుగుతుంది. ఆర్టికల్ 18 ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘిస్తే 20,000 దిర్హామ్‌ల జరీమానాతోపాటు, అక్రమంగా ఉన్న మెటీరియల్‌ని తొలగిస్తారు. మానిటరింగ్ మరియు ఇన్స్పెక్షన్ డైరెక్టర్ సయీద్ అలి అల్ హజ్రి మాట్లాడుతూ, నిబంధనల్ని అతిక్రమించినవారు నోటీసులు అందుకున్న 30 రోజుల్లోపు, తమ తప్పుల్ని సరిదిద్దుకోవాల్సి ఉంటుందనీ, అలాగే 50 శాతం ఫైన్‌ని చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. 30 రోజుల్లోపు స్పందించని పక్షంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయబడటం, అలాగే జ్యుడీషియల్ అథారిటీస్ తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









