లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్
- March 26, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఇక లాక్ డౌన్ ఉండబోదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.పరిశ్రమల మూసివేత కూడా ఉండబోదని..తొందరపాటు నిర్ణయాలు ఉండవన్నారు సీఎం కేసీఆర్.ప్రజలెవరూ భయపడవద్దని..పెండ్లిల కూడా జనం తగ్గించుకోవాలని సూచించారు.గతేడాది లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చాలా నష్టపోయామని సీఎం కేసీఆర్ తెలిపారు.సెల్ఫ్ కంట్రోల్... సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యమని తెలిపారు.కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేయడం బాధాకరమేనని..స్కూళ్ల మూసివేత తాత్కాలికమన్నారు.కరోనా వ్యాక్సిన్ మన చేతిలో లేదని...మన వాటా మనకు వస్తుందన్నారు.ప్రధాని కూడా కరోనా వ్యాక్సిన్‌పై స్పష్టతతో ఉన్నారన్నారని తెలిపారు.గతేడాది లాక్డౌన్ కారణంగా సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న సీఎం.. మాయదారి కరోనా యావత్తు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నారు.తక్కువ మంది అతిధులతో పెళ్లిళ్లు నిర్వహించుకోవాలని సీఎం సూచించారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!
- సోహార్‌లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!
- బంగారం ధర $5,000కి చేరుకుంటుందా?
- బహ్రెయిన్ ఆటమ్ ఫెయిర్..24 దేశాల నుండి 600 మంది ఎగ్జిబిటర్లు..!!
- సౌదీలో అమల్లోకి సౌదీయేతర రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ రెగ్యులేషన్స్..!!
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు







