ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 26, 2021
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.. ఇవాళ ఏకంగా వెయ్యికి చేరువగా వెళ్లాయి కరోనా పాజిటివ్ కేసులు.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,604 సాంపిల్స్ పరీక్షించగా.. 984 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. ఇక, చిత్తూరులో ఒకరు, విశాఖపట్నంలో మరొకరు.. మృతిచెందారు. ఇదే సమయంలో 306 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.. దీంతో.. ఏపీలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,96,863కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 8,85,515కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 4,145 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 7,203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక, ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,49,16,201 సాంపిల్స్ ని పరీక్షించినట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







