షిరిడీలోని సాయిబాబా ఆలయ దర్శన సమయాల్లో కీలక మార్పులు
- March 30, 2021
షిరిడీ:కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించడంతో షిరిడీలోని సాయిబాబా ఆలయ అధికారులు దర్శన సమయాల్లో కీలక మార్పులు చేశారు. ఇకపై ఉదయం 7.15 నిమిషాల నుంచి రాత్రి 7.45 నిమిషాల వరకు భక్తులు ఆలయ దర్శనం చేసుకోవచ్చునని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి భక్తుల సందర్శనార్ధం సాయిబాబా ఆలయం ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉండనుండగా.. నైట్ కర్ఫ్యూ, పెరుగుతోన్న కరోనా కేసుల దృష్ట్యా సమయ వేళల్లో మార్పులు చేశామని అన్నారు. ఇక భక్తుల కోసం ఉచిత ఆహారం అందించే శ్రీ సాయి ప్రసాదాలయ ఇకపై ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు తెరిచి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక ప్రతీ రోజూ తెల్లవారుజామున 4.30 గంటలకు కాకాడ్ ఆర్తీ(మొదటి ఆర్తీ).. అలాగే రాత్రి 10.30 గంటలకు చివరి ఆర్తీ జరుగుతాయని.. ఆ సమయంలో భక్తులకు ఆలయ ప్రాంగణంలో అనుమతి లేదని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక ప్రకటనను జారీ చేసింది. ఈ చర్యలు ప్రజల ప్రయోజనాల కోసమే తీసుకున్నామని.. ప్రతీ ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ భక్తుల సందర్శనార్ధం గతేడాది నవంబర్ 20వ తేదీ నుంచి షిరిడీ సాయిబాబా ఆలయాన్ని తెరిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రతీ రోజూ లక్షల్లో భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







