ప్రైవేటు సెక్టార్‌కి ఊతమిచ్చేందుకోసం షరీక్ ప్రోగ్రామ్ ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్
- March 31, 2021
రియాద్:ప్రైవేటు సెక్టార్‌కి ఊతమిచ్చేందుకోసం షరీక్ (భాగస్వామి) పేరుతో కొత్త కార్యక్రమాన్ని క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు. 12 ట్రిలియన్ సౌదీ రియాల్స్ (3.2 ట్రలియన్ డాలర్ల) ఇన్వెస్టిమెంట్స్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 2030 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు క్రౌన్ ప్రిన్స్. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు సౌదీ అరేబియా స్వర్గధామంగా మారనుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. స్థిరమైన ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 5 ట్రలియన్ సౌదీ రియాల్స్ ఇన్వెస్ట్ చేసేలా ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించనుంది ప్రభుత్వం. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ 3 ట్రలియన్ సౌదీ రియాల్స్ వరకు పెంచనున్నారు. నేషనల్ ఇన్వెస్టిమెంట్ స్ట్రేటజీలో భాగంగా 4 ట్రలియన్ సౌదీ రియాల్స్ కేటాయింపుకి పైన ఫేర్కొన్న 3 ట్రలియన్ సౌదీ రియాల్స్ అదనం. వందలాది, వేలాది ఉద్యోగావకాశాలు ఈ కార్యక్రమం ద్వారా లభిస్తాయి. ప్రస్తుతం వున్న 18వ స్థానం నుంచి 15వ స్థానాకి చేరుకోవడమే లక్ష్యంగా సౌదీ అరేబియా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.
తాజా వార్తలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర









