తెలంగాణ లో కరోనా విజృంభణ..వైద్యశాఖ అత్యవసర సమావేశం
- March 31, 2021
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఇవాళ ఉదయం వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని అధికారులకు మంత్రి సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ పద్దతి కచ్చితంగా అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు వైద్య శాఖ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ అత్యవసరం సమావేశం నిర్వహించనున్నారు.
కొత్తగా 684 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 684 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 394 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,665 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం 1,873 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కొత్తగా రికార్డయిన కేసుల్లో అత్యధికంగా 184 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మంగళవారం రాష్ట్రంలో 56,122 టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,889కు చేరగా.. 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697కు పెరిగింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..









