కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జగన్ దంపతులు
- April 01, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతీ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గుంటూరు భారత్‌పేట 104వ వార్డు సచివాలయంలో వారికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ అనంతరం అరగంట పాటు సీఎం దంపతులిద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. కమ్యూనిటీ హాల్లో ఆయన స్వయంగా వ్యాక్సిన్ వేయించుకుని.. 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ వార్డు, గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన సచివాలయం, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. ఆ తర్వాత గుంటూరు నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2.50 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 3 గంటలకు విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు.
తాజా వార్తలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్‌వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్‌కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..









