దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్న రజినీకాంత్
- April 01, 2021
సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2019కి గాను రజనీకాంత్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకోనున్నట్టు ఆయన తెలియజేశారు. 1969 నుండి ఈ అవార్డులని ప్రకటిస్తుండగా, ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకోగా, ఈ అవార్డు అందుకున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్.
హిందీ చిత్ర సీమ నుండి 32 మంది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. మిగతా 18 మంది ఇతర భాషల నుండి ఎంపికయ్యారు. 2018కి గాను బిగ్‌బీ 66వ జాతీయ చలన చిత్రాల పురస్కారాల్లో భాగంగా అత్యున్నత సినీ జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. కాగా, తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ 6న జరగనుండగా, ఎలక్షన్స్ ముందు కేంద్రం ఈ అవార్డ్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ 2000లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్‌కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ
- NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..
- గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..సీఎం సీరియస్
- అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్
- హైదరాబాద్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!









