స్పోర్ట్స్ యాక్టివిటీస్ రద్దుపై క్లారిటీ ఇచ్చిన ఒమన్

- April 02, 2021 , by Maagulf
స్పోర్ట్స్ యాక్టివిటీస్ రద్దుపై క్లారిటీ ఇచ్చిన ఒమన్

ఒమన్:దేశవ్యాప్తంగా క్రీడల నిర్వహణపై రద్దుకు సంబంధించి ఓమన్ గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ పై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వపరంగాను, ప్రైవేట్ పరంగాను ఇక నుంచి ఎలాంటి క్రీడల నిర్వహణకు అనుమతి ఉండదని వెల్లడించింది. ఇండోర్ స్టేడియం, ఔట్ డోర్ స్టేడియం, ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ కోర్టులలో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ రద్దు చేస్తున్నట్లు గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ తెలిపింది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ ఒకటి నుంచి క్రీడల పై నిషేధం అమల్లోకి వచ్చినట్లు తెలిపిన జి సి సి తదుపరి నోటీసులు వచ్చే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com