కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ హెచ్చరిక

- April 04, 2021 , by Maagulf
కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ హెచ్చరిక

బహ్రెయిన్: గత ఏడాది ఇదే సమయానికి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మళ్లీ ఇప్పుడు సెకండ్ వేవ్ రూపంలో ముంచుకొస్తుందని బహ్రెయిన్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా ప్రజలు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. పబ్లిక్ ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని తెలిపింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటివరకు బహిరంగ ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించని 8,786  మందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే మాస్కు ధరించని 66,714 మంది పై లీగల్ యాక్షన్ తీసుకున్నట్లు ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com