వైరల్ వీడియో: దేశ బహిష్కరణకు ఆదేశం
- April 07, 2021
దుబాయ్: దుబాయ్‌లోని ఓ హై రైజ్ బిల్డింగ్ బాల్కనీలో డజను మంది మహిళలు అసభ్యకరంగా పోజులిచ్చారు. ఓ ఫొటోగ్రాఫర్ డైరెక్షన్ మేరకు వీరంతా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి, నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఎమిరేటీ సొసైటీ విలువల్ని అవమానపరిచేలా ఈ చర్యలున్నాయని పేర్కొన్న అటార్నీ జనరల్ ఆఫ్ దుబాయ్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదీన్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం విచారణ పూర్తి చేసిందన్నారు. నిందితుల్ని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని దుబాయ్ మీడియా కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







