దుకాణం లోనికి దూసుకుపోయిన కారు

- March 02, 2016 , by Maagulf
దుకాణం లోనికి  దూసుకుపోయిన  కారు

నడుపుతున్న వాహనంపై అదుపు కోల్పోయిన ఒక డ్రైవర్ ఏకంగా పెట్రోల్ బ్యాంకు అవరణలొని ఒక దుకాణం లోనికి వేగంగా దూసుకుపోయాడు, ఈ సంఘటన ఫుజైరః పెట్రోల్ పంపు వద్ద ' ఎనోక్  ' దుకాణం ధ్వంసం అయ్యంది. ఈ ప్రమాదంలో ఎక్కువమంది వినియోగదారులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో ఒక  పెద్ద ముప్పు తప్పింది. కారు దుకాణం లోనికి వేగంగా దూసుకువచ్చిన సమయంలో ఒక ఎమిరేట్ మహిళ మాత్రమె ఉంది. ఆ మహిళ సైతం తన ప్రాణాలను వెంట్రుక వాసిలో దక్కించుకొంది. అయితే దుకాణం లో   అల్మారాలు మరియు అద్దాలు తదితర అంశాలను నష్ట పరిచాయి.  ఈ సందర్భంగా  ఎమిరేట్ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని  ' ఏమరాట్  అల్ యుం ', దినపత్రికతో పంచుకొంది. అకస్మాతుగా ఓ కారు తనకు చాలా దగ్గరగా వచ్చిందని తాను  "ఒక క్షణం " లో నిర్ణయం తీసుకొని వెలుపలకు ఒక్క ఉదుటున    పరిగెత్తే భావించానని అదే తన ప్రాణాలు కాపడుకున్నట్లు తెలిపింది. అనంతరం అక్కడకు చేరుకొన్న  పోలీసు ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారని , ఈ ప్రమామ్లో  ఎవరూ గాయపడలేదని పోలీస్ అధికారి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com