జైలు నుంచే BD100,000 మ‌నీ లాండ‌రింగ్

- April 14, 2021 , by Maagulf
జైలు నుంచే BD100,000 మ‌నీ లాండ‌రింగ్

బహ్రెయిన్: ఓ వ్య‌క్తి ఏకంగా జైలు నుంచే మ‌నీ లాండ‌రింగ్ కు స్కెచ్ గీశాడు. అనుకున్న‌ట్లుగానే కొంత మొత్తాన్ని విదేశాల‌కు త‌రించాడు. లావాదేవీల‌పై అనుమానం వ‌చ్చిన అధికారులు విచార‌ణ జ‌ర‌ప‌టంతో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. బ‌హ్రెయిన్ జైలులో ఐదేళ్లుగా జైలు శిక్ష అనుభ‌విస్తున్న ఓ ఖైదీ మ‌రో ఇద్ద‌రితో క‌లిసి విదేశాల‌కు అక్ర‌మంగా న‌గ‌దు బ‌దిలీ చేసిన‌ట్లు తేలింది. మ‌నీ లాండ‌రింగ్ పై అనుమానాలు రాకుండా  ఖైదీకి చెందిన ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ పేరును వాడుకున్నారు. ఈ ముగ్గురు క‌లిసి BD100,000 వ‌ర‌కు అక్ర‌మంగా విదేశాల‌కు త‌రించారు. ఈ ముగ్గురు వ్య‌భిచార ముఠాను కూడా నిర్వ‌హించిన‌ట్లు భావిస్తున్నారు. ఇందులో ఒక‌రు వ్య‌భిచార ముఠా కేసులో ఐదేళ్ల జైలు శిక్ష‌ను కూడా అనుభ‌విస్తున్నాడు. ఈ లాండ‌రింగ్ కేసులోనూ అత‌నే ప్ర‌ధాన సూత్ర‌ధారిగా తెలుస్తోంది. ఫిల్మ్ ప్రొడ‌క్షన్ కంపెనీ పేరుతో 2017 నుంచే మ‌నీ లాండ‌రింగ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com