ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ వేదికల విజయవంతం
- April 14, 2021
బహ్రెయిన్: కరోనా పాండమిక్ సమయంలో వర్చువల్ క్లాస్ రూములు, ఎడ్యుకేషనల్ పోర్టల్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలీ అల నుయైమి మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రిమోట్ లెసన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరానికిగాను 28646 నేరుగా పాఠాలు ఆయా విద్యార్థులకు లాభం చేకూర్చాయి. ఇంటలెక్చువల్ డిజేబిలిటీ మరియు డౌన సిండ్రడోమ్ విద్యార్థులకు 5,736 పాఠాలు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వున్న విద్యార్థులకు 10,416, లెర్నింగ్ డిఫికల్టీస్ విద్యార్థులకు 10,683, స్పీచ్ మరియు లాంగ్వేజ్ సమస్యలున్నవారికి 1,631 పాఠాలు చెప్పడం జరిగింది. అను నిత్యం, ప్రత్యేకావసరాలు గల విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకోసం వారి తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మినిస్టర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







