మసీదుల్లో తరావీహ్ ప్రార్థనలకు పరిమితి
- April 14, 2021
కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వం తరావీహ్ ప్రార్థనల కోసం మసీదుల్లోకి పురుషులకు అనుమతినిస్తోంది పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో. అయితే, తరావీహ్ ప్రార్థనల కోసం 15 నిమిషాల సమయాన్ని మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. కాగా, కువైట్ జనాభా మొత్తం 4.7 మిలియన్లు కాగా, ఇప్పటివరకు 248,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,412 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. ఇషా (సాయంత్రం) ప్రార్థనల తర్వాత తరావీహ్ కోసం రోజుకి 15 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రార్థన తర్వాత మసీదులు మూసివేయడం జరుగుతుది. మసీదులు మరియు బహిరంగ ప్రాంతాల్లో ఇఫ్తార్, సుహుర్ వంటివాటిని బ్యాన్ చేయడం జరిగింది. జనం గుమికూడకుండా ఛారిటీ కార్యక్రమాలకు మాత్రం అనుమతినిచ్చారు. కాగా, ఏప్రిల్ 22 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ కువైట్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుఝామున 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







