ఏపీలో కరోనా అప్డేట్
- April 14, 2021
అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా పెరుగుతుంది.వైరస్ బారినపడుతున్న వారి రోజురోజుకు పెరుగుతోంది.కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 35,732 టెస్టులు చేయగా.. 4,157 కేసులు వెలుగుచూశాయి.తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 9,37,049కు చేరింది.కొత్తగా కరోనా కారణంగా నెల్లూరులో నలుగురు చనిపోగా.. చిత్తూరు, కృష్ణాలో ముగ్గురు చొప్పున, విశాఖలో ఇద్దరు బాధితులు, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,339కి చేరింది.
24 గంటల వ్యవధిలో కొత్తగా 1,606 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రికవరీల సంఖ్య 9,01,327కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,383 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,34,460 నమూనాలను టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 617, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 60 కేసులు వెలుగుచూశాయి.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







