తెలంగాణలో లాక్ డౌన్ పై క్లారిటీ..

- April 16, 2021 , by Maagulf
తెలంగాణలో లాక్ డౌన్ పై క్లారిటీ..

తెలంగాణ: కరీంనగర్ జిల్లా హుజురాబాద్  వ్యవసాయ మార్కెట్ కమిటీలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరడం జరిగిందని..వారు సానుకూలంగా స్పందించారు కానీ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు.ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమే ఆక్సిజన్ కొరత లేకుండా  చర్యలు తీసుకుంటున్నాం..సెకండ్ వేవ్ కరోనా గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ వరి ధాన్యం కొనుగోలులో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కోరుతున్నానని తెలిపారు.  హైదరాబాదులో వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి తెలంగాణకు మిగతా రాష్ట్రాల కంటే వ్యాక్సిన్ కేటాయించడం ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామని వెల్లడించారు.తెలంగాణలో కర్ఫ్యూ 144 సెక్షన్ లాక్ డౌన్ విధించే ఆస్కారం ఉండదని.. ప్రజలే అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని కోరుతున్నామని తెలిపారు.  దేశంలో లో రెండు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి.. మన తెలంగాణలో నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్లు అందించామని..రైతాంగం క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com