శని, ఆదివారాల్లో పూరి జగన్నాథ్ ఆలయం మూసివేత..

- April 17, 2021 , by Maagulf
శని, ఆదివారాల్లో పూరి జగన్నాథ్ ఆలయం మూసివేత..

ఒడిశా: భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా కల్లోలం సృష్టిస్తుంది, దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణ కోసం చర్యలు మొదలు పెట్టాయి.అందులో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తుంటే.. మరొకొన్ని రాష్ట్రాలు పార్కులు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.తాజాగా ఒడిశా ప్రభుత్వం కూడా కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరగడం దృష్ట్యా పూరిలోని ప్రముఖ జగన్నాథ్ ఆలయం వారాంతాల్లో మూసివేయబడుతుందని..జగన్నాథుడి దర్శనం భక్తులకు వారాంతాల్లో ఉండదని జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం తెలిపింది.ఈ కొత్త మార్గదర్శకాలు ఏప్రిల్ 19, 2021 నుండి అమల్లోకి రానున్నాయి.

కోవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి.. ఆలయ ప్రాంగణం పరిశుభ్రం చేయడానికి ఇక నుంచి ప్రతి శని, ఆదివారాల్లో పూరి జగన్నాథ్ ఆలయం మూసివేయబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.ఇక నుంచి శని, ఆదివారాల్లో పబ్లిక్ దర్శనం ఉందన్నారు.పూరి జగన్నాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులందరూ ఆలయ సందర్శనకు 96 గంటలోపు చేసిన కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ (RT-PCR) ను తీసుకుని రావాలని.. ఉత్తర్వులు జారీ చేసింది.

ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వ్యక్తులపై ఆంక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఇతర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి” అని తెలిపింది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఒడిశాలో ప్రస్తుతం 13,837 కరోనా పా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com